నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?

Nandamuri Mokshagna Latest Still Goes Viral

నందమూరి మోక్షజ్ఞ తేజ.. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు-రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మోక్షజ్ఞ పుట్టినరోజున ప్రకటించిన ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్‌’ ఫేమ్ క్రియేటివ్ జెమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మోస్ట్ అవెయిటెడ్ లాంచ్‌ప్యాడ్ ఫిల్మ్ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది.

మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. సాధారణం గళ్ల చొక్కా ధరించి, పొడవాటి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన జుట్టు మరియు గడ్డంతో ఈ నయా లుక్‌లో మోక్షజ్ఞ చరిష్మా చూడముచ్చటగా ఉంది. ఈ స్టిల్ చూస్తుంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ప్రామిసింగ్ స్టార్‌ ఎంటరవబోతున్నాడని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ఇప్పటికే మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో సమగ్ర శిక్షణ పొందాడు. ఎమ్ తేజస్విని నందమూరి సమర్పకురాలిగా, లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. పురాతన పౌరాణిక ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.