కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విష్ణు మంచు

Vishnu Manchu Announced The Release Date of Kannappa

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు.. టిక్కి (గుర్రం)ని ఇటీవలే పరిచయం చేశారు హీరో విష్ణు. ఈ పోస్టర్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలో తాజాగా విష్ణు తండ్రి, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా కన్నప్పలో ఆయన మహాదేవ శాస్త్రి అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలిపింది.

ఈ వరుస అప్డేట్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం హీరో విష్ణు మంచు కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కన్నప్పలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.