విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాయ్’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. భాగ్యం లాంటి పాత్రని స్క్రీన్ మీద రాలేదు. చాలా స్పెషల్ రోల్. ఈ సంక్రాంతి చాలా స్పెషల్ గా వుండబోతోంది. దర్శక నిర్మాతలకు థాంక్. ఈ సంక్రాంతి దిల్ రాజు గారిదే. వెంకటేష్ గారి సినిమా మిస్ అవ్వకుండా చూస్తాం. ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. అంతా ఫ్యామిలీలా ఈ సినిమా చేశాం. ఇది మన సంక్రాంతి” అని అన్నారు.
అలాగే మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఇది నా డ్రీం క్యారెక్టర్. కాప్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ఈ సినిమాతో ఆ డ్రీం నెరవేరింది. చాలా ఫన్ వున్న క్యారెక్టర్. అనిల్ రావిపూడి గారికి థాంక్. వెంకటేష్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మరిన్ని సినిమాలు వారి బ్యానర్ లో చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: