నాలుగేళ్ళ క్రితం హీరో నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు వీరి కాంబోలో రాబిన్ హుడ్ తెరకెక్కుతుంది.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నిన్న ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ 24 గంటల్లో 9 మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకొని ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈరేంజ్ వ్యూస్ అంటే సూపర్ రెస్పాన్స్ వచ్చేనట్లే.ఇక టీజర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.నితిన్ కు ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది.భీష్మ తరువాత తనకు ఆ రేంజ్ హిట్ పడలేదు.దాంతో రాబిన్ హుడ్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఇక నితిన్ ప్రస్తుతం ఈసినిమాతో పాటు తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు.వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా లయ కీలక పాత్రలో కనిపించనుంది.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.మహా శివరాత్రికి విడుదలకానుంది.
ఇవే కాకుండా నితిన్ నెక్స్ట్ మూవీ కూడా ఫిక్స్ అయ్యింది.బలగం ఫేమ్ వేణు తో నితిన్ తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ఎల్లమ్మ అనే టైటిల్ తో తెరకెక్కనుంది.దిల్ రాజు నిర్మించనుండగా దసరా కు రిలీజ్ చేయాలనే ప్లాన్ తో వున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: