యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో ‘భీష్మ’ అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే, ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ సహా అన్ని ప్రచార చిత్రాలకి మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీలో ఇంకా 2 పాటలు, 6 రోజుల టాకీ షూట్ మాత్రమే పెండింగ్ వుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం చిల్డ్రన్స్ డే సందర్భంగా నేడు రాబిన్‌హుడ్ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది, ఇది ఇంటెన్స్ నెరేటివ్ కి టోన్‌ని సెట్ చేస్తుంది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు.
ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం శ్రీలీల ని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. ఇక వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈసారి, టీజర్ నితిన్ పాత్రపై మరింత ఇన్ సైట్ ని అందిస్తూ, మూవీ ప్రిమైజ్ ని గ్లింప్స్ గా అందిస్తుంది. వినోదం, యాక్షన్, బ్రెత్ టేకింగ్ మూమెంట్స్ బ్లెండ్ తో దర్శకుడు ప్రేక్షకులను కట్టిపడేశాడు.
నితిన్ రాబిన్‌హుడ్‌గా అదరగొట్టారు, డిఫరెంట్ లుక్‌లలో డైనమిక్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఒక సీన్ నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్, మరో సీన్ లో అరబ్ షేక్‌గా కనిపించి తీరు విశేషంగా అలరించింది. సినిమా రెండు విభిన్న కోణాలను, నితిన్ వెర్సటాలిటీని హైలైట్ చేస్తుంది. శ్రీలీల రిచ్ అండ్ ఆరోగేంట్ గర్ల్ గా తన పాత్రలో అలరించింది.
రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో పాత్రలను కూడా టీజర్ పరిచయం చేసింది. సాయి శ్రీరామ్ తన అద్భుతమైన కెమెరా పనితనంతో రిచ్ నెస్ తీసుకొచ్చారు. జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో భావోద్వేగాల ఎలివేట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























