ధనుష్ ,రష్మిక మందన్న, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈ నెలలో బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈ రోజు గ్లింప్స్ ను వదిలారు.సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఇంట్రెస్టింగ్ కట్ చేశారు. ముఖ్యంగా ధనుష్ రోల్ ఆసక్తిని పెంచుతుంది.లీడ్ యాక్టర్స్ ప్రెజెంటేషన్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.డబ్బు చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఈసినిమా.
శేఖర్ కమ్ముల తన స్టైల్ కు భిన్నంగా భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.పక్కా బ్లాక్ బాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.
ఇక ధనుష్ ప్రస్తుతం ఈసినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తుండగా రష్మిక పుష్ప 2 ,ది గర్ల్ ఫ్రెండ్ అలాగే హిందీ లో సికిందర్ తో బిజీ గా వుంది.ఇక నాగార్జున ప్రస్తుతం కుబేర తోపాటు కూలీ చేస్తున్నాడు.అయితే ఇందులో హీరోగా కాకుండా నాగ్ నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: