నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, సలోని, నవీన్ చంద్ర, కన్నడ కిశోర్, రవి శంకర్, సత్యం రాజేష్, అజయ్ ఘోష్, మైమ్ గోపి తదితరులు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాణం: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. అయితే వరుణ్ గత చిత్రాలు రెండూ ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వేలంటైన్’ ఆశించిన ఫలితం అందుకోలేదు. ఈ నేపథ్యంలో మట్కా వాసుగా వచ్చిన మెగా ప్రిన్స్ హిట్ అందుకున్నాడా? ఒకప్పటి వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అయిందా? ఇంతకూ మట్కా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే రివ్యూ చూడండి.
కథ:
కథానాయకుడు వాసు (వరుణ్ తేజ్) ఓ శరణార్థి. చిన్నప్పుడే బర్మా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడతాడు. శరణార్థుల శిబిరంలో ప్రసాద్ (సత్యం రాజేష్) పరిచయం అవుతాడు. అయితే ఓసారి అక్కడ జరిగిన ఓ ఘర్షణ కారణంగా వాసు జైలుకు వెళతాడు. శిక్ష పూర్తై బయటకు వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్టులో కొబ్బరికాయల కొట్టు నడిపే అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) వద్ద పనికి చేరతాడు.
ఈ క్రమంలో అతను మట్కా కింగ్‌గా మారతాడు. అయితే సాధారణ పనివాడిగా ఉండే వాసు, మట్కా కింగ్ ఎలా అయ్యాడు? సుజాత (మీనాక్షి చౌదరి)తో అతని ప్రేమ కథ ఏంటి? వాసు జీవితంలో ఎంపీ నాని బాబు (కన్నడ కిశోర్), సోఫియా (నోరా ఫతేహి) పాత్రలు ఏమిటి? అసలు వాసుని సీబీఐ ఎందుకు టార్గెట్ చేస్తుంది? సాహు (నవీన్ చంద్ర) ఎవరు? లేదా? మట్కా వాసు జీవితం చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ:
మట్కా అనేది ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసారు తెలుగు ఆడియెన్స్. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు దర్శకుడు కరుణ కుమార్. మట్కాను కథగా చెప్పాలంటే, పొట్టకూటి కోసం పనిచేసుకునే హీరో.. జీవితంలో ఎలాగైనా ఎదగాలని నిర్ణయించుకోవడం, దీనిలో భాగంగా అతడు ఓ నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం, వేల కోట్లు సంపాదించడం, ఈ ప్రయాణంలో తనకు అడ్డొచ్చిన వారిని చంపడం ఇంతే.
ఇలాంటి సినిమాలలో కథానాయకుడికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, లేదంటే అంతకన్నా బలమైన ఓ మోటో ఉండాలి. వీటితో పాటుగా కథలో బలమైన భావోద్వేగాలు, పాత్రల మధ్య సంఘర్షణ, అందుకు దారితీసిన పరిస్థితులు కన్విన్సింగ్‌గా చెప్పగలగాలి. అప్పుడే హీరో పాత్రతో ప్రేక్షకులు ట్రావెల్ చేయగలరు. దీనికి తాజా ఉదాహరణ ‘కేజీఎఫ్’.
ఈ విషయంలో దర్శకుడు కరుణ కుమార్ తనవంతు ప్రయత్నం నిజాయితీగా చేసాడు. మట్కాలో యాక్షన్ అంశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నాడు. వాసు తన కుమార్తెకు చెప్పే మేక-నక్క కథలో వలే సినిమాలోనూ ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ కథ, హీరో జీవితంలో ఎదిగిన తీరు ఆసక్తికరంగా ఉంటాయి.
ఇక నటీనటుల విషయానికొస్తే, వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో వెనుకాడడు అనే విషయం తన మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. చేసింది కొన్నే అయినా, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసాడు. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రలోనే కనిపించాడు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా వివిధ గెటప్స్ లో అద్భుతంగా నటించాడు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించింది. ఇందులో తను మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అలాగే నోరా ఫతేహి, సలోని నటన డీసెంట్ గా ఉంది. నవీన్ చంద్ర, కన్నడ కిశోర్, రవి శంకర్, సత్యం రాజేష్, అజయ్ ఘోష్, మైమ్ గోపి తదితరులు తమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అలాగే యాక్షన్ సీన్స్‌లో బీజీఎమ్ హైలైట్ అవుతుంది. ఎ కిషోర్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. విజువల్స్, లొకేషన్స్ అందంగా ఉన్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది.
ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. 1960ల నాటి కాలాన్ని చాలా చక్కగా ఆవిష్కరించింది టీమ్. అలాగే చిత్ర నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. సినిమాలో సెట్టింగ్స్ చూస్తుంటే నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని అర్ధమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: