టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ అద్భుతమైన స్పందనతో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్‌గా ఇంకో హీరో నారా రోహిత్ ఫెరోషియస్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఇటీవలే మరో హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గజపతి వర్మగా ఫెరోషియస్, రగ్గడ్ అవతార్‌లో కనిపించారు.
భైరవంలో నటించనున్న కథానాయికను పరిచయం చేసారు. ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ కుమార్తె, నటి అదితి శంకర్ ఇందులో వెన్నెల అనే పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదితి పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. రెండు జడలతో, లంగావోణీలో మోపెడ్‌పై పాల క్యాన్ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. కాగా అదితి శంకర్ పూర్తిస్థాయిలో నటిస్తోన్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం సందడి చేస్తుండగా.. పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ముగ్గురూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే హరి కె వేదాంతం సినిమాటోగ్రాఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: