ఒకే నెలలో మూడు సినిమాలు.. చాలా ఎక్సయిటింగ్గా ఉంది

Actress Meenakshi Chaudhary Shares Her Work Experience For Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

దీపావళికి లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టారు మళ్లీ ఇప్పుడు మట్కా వస్తున్నారు? ఎలా అనిపిస్తోంది?

చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి యాక్టర్ డ్రీమ్. లక్కీ భాస్కర్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు మట్కా వస్తుంది. ఇదే నెలలో మెకానిక్ రాకీ సినిమా కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఒకే నెలలో మూడు సినిమాలు రావడం యాక్టర్‌గా నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇది నాకు స్పెషల్ మూమెంట్. మట్కా కోసం చాలా ఎక్సయిటెడ్‌గా ఉన్నాను.

మట్కాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?

మట్కాలో సుజాత క్యారెక్టర్‌లో కనిపిస్తాను. సుజాత వాసు లవ్ ఇంట్రెస్ట్. నా పాత్ర మూడు డిఫరెంట్ ఫేజుల్లో ఉంటుంది. వాసు క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఒక లైఫ్ జర్నీ ఉంటుంది.

సుజాత వెరీ పాజిటివ్ క్యారెక్టర్. వాసు లైఫ్‍లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సుజాత క్యారెక్టర్‌లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. వాసు జీవితంలో ఒక వెలుగు లాంటి క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకునేలా నా క్యారెక్టర్ ఉంటుంది.

ఇది ఒక లైఫ్ జర్నీ కదా.. మేకోవర్ ఛాలెంజింగ్‌గా అనిపించిందా?

చాలా ఎక్సైటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వుంది. ఇందులో ఒక వింటేజ్ లుక్ ఉంటుంది. టీనేజ్‌లో ఒకలా కనిపిస్తుంది. లైఫ్‍లో దశలు మారుతున్న కొద్దీ ఆ లుక్ మారుతూ ఉంటుంది. డైరెక్టర్ గారు లుక్ విషయంలో చాలా పర్టికులర్. ఆయన చాలా పర్టికులర్‌గా స్కెచెస్ వేసి ఈ క్యారెక్టర్ లుక్‌ని డిజైన్ చేశారు. మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకున్నారు. రియల్లీ ఇది చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.

సుజాత క్యారెక్టర్ ప్లే చేయడం మీకు ఛాలెంజింగ్ గా అనిపించిందా?

డెఫినెట్‌గా ఈ క్యారెక్టర్ చేయడంలో ఒక ఛాలెంజెస్ వున్నాయి. ఇది ఒక పీరియడ్ డ్రామా. మోడ్రన్ టైమ్స్‌తో పోల్చుకుంటే పీరియడ్ టైంలో బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అది అచీవ్ చేయడానికి కచ్చితంగా హోంవర్క్ చేయాలి. అది నేను చేశాను. అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్‌లో చాలా డిఫరెంట్ లుక్ ఉన్న సినిమా ఏది. డెఫినెట్‌గా చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశాను.

హీరో గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి?

వరుణ్ తేజ్ గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. వరుణ్ వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. సెట్‌లో చాలా హెల్ప్ ఫుల్‌గా వుంటారు. ఆయనకి సినిమా గురించి చాలా నాలెడ్జ్ ఉంది. వాసు క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.

మా కాంబినేషన్‌లో ఒక సాంగ్ ఉంది. అది లవ్ సాంగ్. ఒక లైఫ్ స్టోరీ ఇలా ఉంటుంది. ఆ సాంగ్‌ని డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా కోసం అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. తప్పకుండా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

మట్కా ప్రొడ్యూసర్స్ గురించి?

నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించారు. వారి నిర్మాణంలో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.

ఎలాంటి జోనర్స్ చేయడం ఇష్టం?

అన్ని జోనర్స్ ఇష్టమే. కథ బాగుంటే అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్‌లో ఉన్నాను.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.