టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీబ్రా ట్రైలర్ హైలైట్స్ ఇవే..
ఈ ట్రైలర్ గమనిస్తే.. సినిమా ప్రధాన కథాంశాన్ని రివీల్ చేస్తోంది, ఇది వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది, బ్యాంకు ఫ్రాడ్ చుట్టూ తిరిగే కథాంశం. ఆర్థిక నేరాల డేంజరస్ వరల్డ్ లో చిక్కుకుంటాడు హీరో. రెస్పెక్ట్ అల్టిమేట కరెన్సీ అని భావించే రూత్ లెస్ గ్యాంగ్‌స్టర్ డాలీ నుంచి అతనికి పెద్ద ముప్పు ఉంటుంది. ఈ డేంజర్ నుండి తప్పించుకోవడానికి, హీరో, ఫ్రెండ్స్ గ్యాంగ్ తీసుకున్న రిస్క్ ని ఎక్సయింటింగ్ గా ప్రజెంట్ చేస్తోంది.
ఇక ఈ మూవీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు రోమాన్స్, ఫన్ బ్లెండ్ ని అద్భుతంగా అందిస్తోంది. సత్యదేవ్ హీరోగా అదరగొట్టారు, విలన్ గా డాలీ ధనంజయ టెర్రిఫిక్ గా వున్నారు. సునీల్ పాత్రలో కూడా నెగెటివ్ షేడ్స్ వున్నాయి. సత్య కామిక్ రిలీఫ్ అందించారు. సత్యదేవ్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. సత్యరాజ్ కూడా తనదైన ముద్ర వేశారు.
ఈశ్వర్ కార్తీక్ బ్రిలియంట్ రైటింగ్ తో, అలాగే స్టైలిష్ టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. సత్య పొన్మార్ కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలిచింది, రవి బస్రూర్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో విజువల్స్‌ని ఎలివేట్ చేశాడు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. మీరాఖ్ డైలాగ్స్, అనిల్ క్రిష్ ఎడిటింగ్ చాలా బావున్నాయి. మొత్తానికి టీజర్, ప్రోమోలు సంచలనం సృష్టించగా, ట్రైలర్ వాటిని మరో స్థాయికి తీసుకెళ్లింది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























