మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మట్కా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. టీం అంతా పాల్గొనగా భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి హాజరై ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు.
ఈ సందర్భంగా సత్యానంద్ మాస్టర్ అందరు స్టార్ హీరోలందరూ తన శిష్యులేనని చెప్పారు. సత్యానంద్ మాస్టర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. నా అదృష్టం ఏంటంటే గ్రేట్ హీరోస్ అందరూ నా స్టూడెంట్స్. అందులో ప్రత్యేకమైన స్టూడెంట్ ఎవరంటే మా వరుణ్ బాబు. వరుణ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నా దగ్గర నటన నేర్చుకునేటప్పుడు ఒక చిన్న పిల్లాడికి నేర్పిస్తున్న ఫీలింగ్ కలిగేది.”
“చాలా కష్టపడి చాలా ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. తను ఎంత పెద్ద యాక్టర్ అవుతాడు అనేది నాకు మాత్రమే తెలుసు. ముకుంద ఫంక్షన్లో ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతానని చెప్పాను. అప్పుడు చాలామంది ఏమిటి ఇంత నమ్మకంగా చెప్తున్నారు అనుకున్నారు. తర్వాత ఆయన చేసిన కంచె, ఫిదా, గద్దల కొండ గణేష్.. ఇవన్నీ వరుసగా చూసుకుంటూ వస్తుంటే చాలా ఎదుగుదల కనిపించింది. వరుణ్ ఇంకా ఎదగాలని, ఎదుగుతారని నమ్ముతున్నాను.”
“కరుణ కుమార్ గారు మట్కా చిత్రానికి వరుణ్ బాబుని ఎన్నుకోవడం నా అదృష్టం. నా అదృష్టం కొద్ది ఆయనకి ఆ క్యారెక్టర్ వచ్చింది. చాలా సైకలాజికల్ గా పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ ని వరుణ్ బాబు చాలా అద్భుతంగా చేశాడని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా కరుణ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీమ్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఆల్ ది బెస్ట్ వరుణ్ బాబు. పెద్ద హిట్ కొడతారు” అని అన్నారు సత్యానంద్ మాస్టర్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: