వరుణ్ తేజ్ మట్కా ఈనెల 14న థియేటర్లోకి రానుంది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాకు సెన్సార్ వాళ్ళు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదని నిర్మాణ విలువలు బాగున్నాయని వరుణ్ నటన ,కరుణ కుమార్ డైరెక్షన్ మెచ్చుకున్నారట. సినిమాలో చివరి 20నిమిషాలు హైలైట్ అవ్వనుందట.సినిమా విజయంపై మట్కా టీం కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.ఈసినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 33నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఇందులో వరుణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ సాధారణ వ్యక్తి మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ తో వస్తుంది ఈసినిమా.ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి ,నవీన్ చంద్ర, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ ,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి.
అయితే ఈసినిమాకు సూర్య కంగువా రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది.మట్కా రిలీజ్ అవుతున్న రోజే కంగువా కూడా రానుంది.ఈసినిమాకు తమిళంలో ఎంత హైప్ ఉందో తెలుగులోనూ అంతే వుంది.మట్కా తో పోలిస్తే థియేటర్ల సంఖ్య కూడా పెరగనుంది.దాంతో మట్కా కు పోటీ తప్పదు.
అటు మట్కా విజయం వరుణ్ కు తప్పనిసరి కానుంది.గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు వరుణ్.అయితే మట్కా తన ఎదురుచూపులకు బ్రేక్ వేసేలానే వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: