వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్

Lucky Baskhar joins 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍 dollar club in the United States

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అందులో భాగంగా నిన్నటి తో ఈసినిమా యూఎస్ఏలో 1మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఫుల్ రన్ లో 1.5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈరోజు బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అటు తమిళనాడులో ఊహించని రన్ ను కొనసాగిస్తోంది.రెండో వారంలో స్కీన్స్ కూడా పెంచారు.అమరన్ తో భారీ పోటీ వున్నా లక్కీ భాస్కర్ సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను మార్క్ ను క్రాస్ చేసింది.కంగువా వచ్చే వరకు లక్కీ భాస్కర్ హవా కొనసాగనుంది.

ఓవరాల్ గా 9రోజుల్లో ఈసినిమా 78కోట్ల వసూళ్లను దక్కించుకుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.నాగవంశీ, సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.ఇక ఈసినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకోనున్నారు లక్కీ భాస్కర్.తెలుగులో ఇది తనకు వరసగా రెండో బ్లాక్ బాస్టర్.ఇంతకుముందు సీతారామంతో సక్సెస్ కొట్టి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.