మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’, సెకండ్ సింగిల్ ‘తస్సాదియ్యా’, అలాగే రీసెంట్‌గా ‘రామ టాకీస్ రోడ్డు.. అల్లిపురం మేడ.. దొండపర్తి చిలక’ అంటూ సాగే మరో లిరికల్ రిలీజ్ చేయగా.. చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మట్కా విడుదలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. ఈ సినిమాను నార్త్ అమెరికాలో రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు నార్త్ అమెరికా హక్కులను దక్కించుకున్న శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ అక్కడ పెద్ద ఎత్తున విడుదలచేయనుంది. కాగా మరోవైపు మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయింది. నవంబర్ 10న వైజాగ్ లోని నోవోటెల్ హోటల్ ఎదురుగా ఉన్న గోకుల్ పార్క్ వద్ద సాయంత్రం 5:30 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నారు.
కాగా మట్కా వరుణ్ తేజ్ కెరీర్‌లో మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ పీరియాడికల్ డ్రామాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా.. ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: