యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటిస్తున్న సినిమా భైరవం.ఓ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా వస్తుందని టాక్. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేయగా ఇక ఈరోజు నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో యాక్షన్ లుక్ తో కనిపించాడు రోహిత్.ఇందులో తను వరద అనే పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రథమార్థం లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక నారా రోహిత్ ఈ సినిమా కాకుండా సోలో హీరోగా సుందరకాండ అనే సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల,గౌతమ్ రెడ్డి,రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: