క 6డేస్ కలెక్షన్స్

ka six days collections

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుండడంతో 30కోట్ల మార్క్ దాటింది.కిరణ్ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి. 6 రోజుల్లో ఈసినిమా 32.64కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో మంచి లాభాలను తీసుకొస్తుంది.మరి ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో త్వరలోనే విడుదలకానుంది.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన సంస్థ దక్కించుకుంది దాంతో అక్కడ గ్రాండ్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక క డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.ప్రముఖ ఓటిటి ఫాన్సీ రేట్ కు క ను దక్కించుకుంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుజీత్,సందీప్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.ఈసినిమాను వంశీ నందపాటి రిలీజ్ చేశాడు.ఇంతకుముందు ఈ నిర్మాత కమిటీ కుర్రాళ్ల తీసి బ్లాక్ బాస్టర్ కొట్టాడు.

ఇక క హిట్ కావడంతో దీనికి సీక్వెల్ కూడా రానుంది.అయితే వెంటనే మొదలు పెట్టే అవకాశం అయితే లేదు.కిరణ్ ఇంకో సినిమా చేసిన తరువాత క 2 పట్టాలెక్కే ఛాన్స్ వుంది. త్వరలోనే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ అప్డేట్ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.