టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం ‘సర్కారు నౌకరి’ అరుదైన గౌరవం అందుకుంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికయింది. వచ్చే నెలలో జరుగనున్న ఈ వేడుకలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాంపిటీషన్ ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో.. ఈ ఏడాది జరుగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో సర్కారు నౌకరి చిత్రాన్ని ఎంపిక చేసినట్టు తెలిపింది. ఇలాంటి సృజనాత్మక సినిమాను తెరకెక్కించినందుకు దర్శకుడు గంగనమోని శేఖర్ మరియు చిత్ర బృందం అంకితభావాన్ని కొనియాడింది.
కాగా ఈ మూవీతో భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వగా.. తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అయితే సర్కారు నౌకరి సినిమాను ఆర్‌కే టెలిషో పతాకంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం.
సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక మంచి సందేశాత్మక సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా ఈ చిత్రంలో యువ హీరో ఆకాశ్ గోపరాజు యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి.
తొలిసినిమానే అయినా.. ధైర్యంగా ఇలాంటి బరువైన పాత్ర ఎంచుకున్నందుకు అందరూ అతడి ప్రయత్నాన్ని కొనియాడారు. ఇక థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ‘సర్కారు నౌకరి’ అనంతరం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అక్కడ కూడా ఈ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది.
‘సర్కారు నౌకరి’ కథ ఏంటంటే..?
1990ల కాలంనాటి నేపథ్యంలో సినిమా కథ జరుగుతుంది. ఇందులో హీరో ఆకాశ్ గోపరాజు గోపాల్ అనే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించారు. అతడికి సత్య(భావన)తో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ప్రమోషన్ మీద మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగి కావటంతో గ్రామస్తులు అతడిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు.
అయితే అప్పట్లో ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అధికారులు గోపాల్‌కు కండోమ్స్ పంచే పనిని అప్పగిస్తారు. ఈ క్రమంలో రోజులు గడిచే కొద్ది జనాలకు గోపాల్ మీద ఉన్న గౌరవం పోతుంది. గోపాల్‌ని వారంతా చాలా చులకనగా చూస్తారు. చివరికి వారిని ఆ ఊరి జనం అంటరాని వారిగా పరిగణిస్తుంటారు.
అయితే ఇది తట్టుకోలేక భార్య గోపాల్‌ని వదిలి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. మరోవైపు ఊరిలో ఎయిడ్స్ కారణంగా వరుసగా చనిపోతుంటారు. అందులో గోపాల్ ఫ్రెండ్ శివ కూడా ఉంటాడు. ఇలా వరుసగా ఎయిడ్స్‌తో మరణిస్తుండటం, మరోవైపు ఊర్లో అందరు తనని అవమానించడం జరుగుతుంది.
మరి దాన్ని గోపాల్ ఎలా ఎదుర్కొన్నాడు..? వారిలో అవగాహన పెంచేందుకు ఏం చేశాడు? తనని వదిలిపెట్టిన భార్య తిరిగి వచ్చిందా? ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగమే గోపాల్ చేయడానికి కారణం ఏమిటి? అసలు అతడి గతం ఏమిటి? అనేదే సర్కారు నౌకరి సినిమా మిగతా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: