‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.
దీంతో రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సక్సెస్ మీట్‌లో దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్ సినిమా చేయడం అనేది కష్టమైన పనే. అది వెంకీ సార్ సినిమాతో స్టార్ట్ చేసి, లక్కీ భాస్కర్ తో ల్యాండ్ అయ్యాడు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వెంకీ సార్ సినిమా నుంచి నచ్చడం మొదలెట్టాడు. ఎందుకంటే తను ముందు చేసిన లవ్ స్టోరీలు లాంటివి చాలామంది చేశారు. కానీ సార్ సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృద్యంగా చెప్పడం గ్రేట్. నేను ఆ సినిమా చూసి ఏడ్చాను. అప్పటినుంచి నేను వెంకీకి ఫ్యాన్ అయ్యాను. మా అమ్మగారు, అమ్మమ్మగారు లక్కీ భాస్కర్ సినిమా చూసి.. నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు. ప్రేమకథలు కాదు, ఇలాంటి పనికొచ్చే సినిమాలు చేయమని చెప్పారు. 70-80 ఏళ్ళ వయసున్న వారు కూడా సినిమా గురించి ఇలా మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: