శివ కార్తికేయన్ అమరన్ ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.మొదటి మూడు రోజులు అద్భుతమైన వసూళ్లను సాధించగా ఆదివారం కూడా రాంపేజ్ కొనసాగించింది.దాంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.అంతేకాదు శివ కార్తికేయన్ కెరీర్లో నే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు డాన్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా ఉండేది. అయితే అమరన్ కేవలం నాలుగు రోజుల్లోనే ఆ వసూళ్లను క్రాస్ చేసింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 300 కోట్లు కొల్లగొట్టేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో కూడా అమరన్ సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను ఇక్కడ విడుదలచేయగా నాలుగు రోజుల్లో 15కోట్లకు పైగా రాబట్టింది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో డబుల్ బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది. ఫుల్ రన్ లో 25కోట్ల మార్క్ ను చేరుకునేలా వుంది.బయ్యర్ల పాలిట ఈసినిమా జాక్ పాట్ కానుంది.తెలుగులో తక్కువగా ప్రీ రీలీజ్ బిజినెస్ చేసింది.ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు.అయినప్పటికీ మౌత్ టాక్ తో అదరగొడుతుంది.అటు నార్త్ అమెరికాలో అమరన్ 1మిలియన్ మార్క్ కు చేరువైంది.ఈరోజుతో ఆ ఫీట్ సాధించినుంది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈసినిమాలో మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.సీనియర్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: