మేము ముగ్గురం దుల్కర్‌తో హిట్లు కొట్టాం

Venky Atluri Praises Directors Nag Ashwin and Hanu Raghavapudi

‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.

దీంతో రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి చిత్ర బృందానికి థాంక్స్ చెప్పారు. వెంకీ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “నాగ్ అశ్విన్, హను గారిని ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. నేను నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా కోసం హను గారు నన్ను ఆడిషన్ చేశారు. అలాగే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అప్పుడు నాగి నన్ను ఆడిషన్ చేశాడు. ఇప్పుడు మేము ముగ్గురం దుల్కర్ గారితో సినిమాలు చేసి హిట్లు కొట్టాం.”

“లక్కీ భాస్కర్ తో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే ఒకేసారి మూడు మంచి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏబీసీడీ సినిమా చూసినప్పటి నుంచి దుల్కర్ గారితో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో కుదిరింది. కథ విన్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సినిమా చేయడానికి అంగీకరించారు.”

“ఇక ‘గుంటూరు కారం’ చేస్తున్నప్పుడు మీనాక్షి పేరుని త్రివిక్రమ్ గారు, వెంకీ గారు సూచించారు. ఆడిషన్ చేసినప్పటి నుంచి తను నా కంటికి సుమతి లాగానే కనిపించింది. అలాగే సాయి కుమార్ గారు, శ్రీనాథ్ మాగంటి, కసిరెడ్డి, మహేష్, శశిధర్ గారు, శివన్నారాయణ గారు, గాయత్రీ భార్గవి గారు, మాణిక్ గారు, సచిన్ ఖేడేకర్, రఘుబాబు గారు, శ్రీకాంత్, మానస్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేసి సినిమాని నిలబెట్టారు. హైపర్ ఆదికి స్పెషల్ థాంక్స్.”

“అందరూ సినిమాలో సెట్లు సహజంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం నా ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్. సినిమాటోగ్రాఫర్ నిమిష్ మరియు బంగ్లాన్ ని నాకు పరిచయం చేసినందుకు దుల్కర్ గారికి థాంక్స్. రూపాయి గురించి ఆలోచించకుండా పేరు గురించి మాత్రమే ఆలోచించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు నాగవంశీ గారు. పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది.”

“ఆ కాలంలో దుస్తులు ఎలా ఉంటాయో రీసెర్చ్ చేసి, అందుకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన అర్చన, సంధ్యకి థాంక్స్. కొరియోగ్రాఫర్ రఘు గారికి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి గారికి, శ్రీమణి గారికి థాంక్స్. అలాగే మా దర్శకత్వ విభాగంతో పాటు, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియాకి, మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అని అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.