యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ భారీ బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మ్యూజికల్ జర్నీ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇటీవలే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘హే తార’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఇది మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం నుంచి సెకండ్ సింగిల్ విడుదలకానుంది. ప్రముఖ గాయకుడు కార్తీక్ ఆలపించిన ‘నీతో ఇలా’ అనే మెలోడియస్ సాంగ్‌ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. రేపు సాయంత్రం 4:05 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాలో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తుండగా.. యంగ్ కమెడియన్ హర్ష చెముడు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్. బాపినీడు.బి ఈ చిత్రానికి సమర్పణ. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
యూత్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ సినిమా.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, చక్కటి కామెడీ, రొమాన్స్ సహా అన్నీ అంశాలతో రూపొందింది. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. ఈసారి నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పక్కా అని అర్ధమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























