కంగువ వెనుక నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది – సూర్య

Kanguva Vizag Mega Event Hero Suriya Great Words About His Wife, Actress Jyothika

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 14న కంగువ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ విశాఖపట్నంలో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సూర్య చిత్ర విశేషాలు పంచుకున్నారు.

సూర్య ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “వైజాగ్ కంగువ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఘంటా శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు చెబుతున్నాం. వైజాగ్ తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా నాన్నగారి సినిమాల షూటింగ్ విశాఖలో జరిగినప్పుడు మేము వచ్చేవాళ్లం. అప్పటినుంచి వైజాగ్ తో అనుబంధం కొనసాగుతోంది.”

“ఇక నేను కంగువ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది. మా యూనిట్ లోని మూడు వేల మంది జీవిత భాగస్వాములు కూడా తమ కుటుంబాలను ఏ లోటు లేకుండా చూసుకోవడం వల్లే మేము రెండేళ్ల పాటు కంగువ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేయగలిగాం. అందుకు ఆ గొప్ప మహిళలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.”

“నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి మంచి మిత్రులు దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా డబ్బు కోసం చేసింది కాదు. మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్‌లో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కంగువ ఉంటుంది. నవంబర్ 14న థియేటర్స్‌లో కంగువ చూసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు హీరో సూర్య.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.