ప్రముఖ మలయాళ నటుడు, ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “లక్కీ భాస్కర్.. ఒక కామన్ మ్యాన్ స్టోరీ. కొత్త జానర్ సినిమా, నాకు ఓ కొత్త ప్రయత్నం. మా డైరెక్టర్ వెంకీ చూడటానికి చిన్నాకుర్రాడిలా, కాలేజ్ స్టూడెంట్‌లా ఉంటాడు. కానీ తను రాసిన సన్నివేశాలు, మాటలు గొప్పగా ఉంటాయి, హృదయాలను తాకుతాయి. ఈ సినిమాకి నేను మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. మీనాక్షి చౌదరి అద్భుతమైన పాత్ర చేసింది. తనతో నటించిన సన్నివేశాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇదొక సగటు మనిషి జీవితం. అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “త్రివికమ్ గారికి నేను అభిమానిని. ఆయన తీసిన ‘అల వైకుంఠపురములో’ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఒక కమర్షియల్ సినిమాలో కూడా ఎంతో అర్ధవంతంగా మాటలు రాయడం ఆయనకే చెల్లుతుంది. నటుడు రాంకీ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. విజయ్ దేవరకొండ నా తమ్ముడు. మహానటి, సీతారామం సినిమాలకు విజయ్ వచ్చాడు. అవి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు దీనికి వచ్చాడు, ఇది కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు దుల్కర్ సల్మాన్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























