దుల్కర్‌ని చూసి తండ్రిగా మమ్ముట్టి గర్వపడతారు

Director Trivikram Srinivas Praises Dulquer Salman at Lucky Bhaskar Pre-release Event

ప్రముఖ మలయాళ నటుడు, ‘మహానటి’ ఫేమ్ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన తాజా తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మమ్ముట్టి మర్రిచెట్టులాంటి వారు. మర్రిచెట్టు కింద సాధారణంగా ఇతర మొక్కలు బ్రతకవు. అయితే ఆయన కొడుకుగా పుట్టి, అలాంటి నటుడి నీడలో నుంచి పక్కకు వచ్చి సొంతంగా ఎదగడమంటే, మాటలు కాదు. తన దారి తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ, దుల్కర్ అది చేసి చూపించాడు. దుల్కర్‌ మామూలు నటుడు కాదు. మమ్మూట్టి గారు దుల్కర్‌ కెరీర్‌ చూసి తండ్రిగా గర్వపడతారు” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి భాస్కర్‌ పాత్ర లక్కీ అవ్వాలని కోరుకుంటారు. ఫైనల్‌గా అతను లక్కీగానే బయటకు వస్తాడు. ఈ టైటిల్‌ సినిమాకు పర్‌ఫెక్ట్ యాప్ట్‌. దుల్కర్‌ సల్మాన్‌ వేరే లెవెల్‌లో యాక్ట్‌ చేశాడు. చాలా ఎఫర్ట్‌ లెస్‌గా చేశాడు. అది మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌. రాంకీగారి పాత్ర నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చూసి తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్‌లో నుంచి మీ అందరూ బయటకు వస్తారు. వెంకీ అట్లూరి సక్సెస్‌ అందుకోనున్నాడు” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.