యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.ఇంతకుముందు తన ఏ సినిమాలకు రాని బజ్ ఈసినిమాకు వస్తుంది. దానికి కారణం రెగ్యులర్ స్టోరీతో కాకుండా ఈసారి డిఫ్రెంట్ కంటెంట్ తో వస్తున్నాడు.ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.బిజినెస్ కూడా బాగానే చేసింది.కిరణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఇన్ని ప్రత్యేకలతో వస్తున్న ఈసినిమాపై కిరణ్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈసినిమా తో హిట్ కొడతానని నమ్మకంగా చెపుతున్నాడు.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను ముందు పాన్ ఇండియా మూవీ గా విడుదలచెయ్యాలనుకున్నారు.కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారు.క మలయాళం రైట్స్ ను హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలింస్ దక్కించుకుంది.అయితే క రిలీజ్ అవుతున్న రోజే దుల్కర్ లక్కీ భాస్కర్ కూడా వస్తుంది. దాంతో క ను అక్కడ విడుదలచేయడం కరెక్ట్ కాదని వెనక్కి తగ్గారు.తమిళంలో థియేటర్లు దొరకడం లేదు. దాంతో క ప్రస్తుతానికి తెలుగుకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు.సినిమా ఫలితాన్ని బట్టి మిగితా భాషల్లో రిలీజ్ ఉంటుంది.
సుజీత్,సందీప్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు.తెలుగులో ఈసినిమాను వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈసినిమాతో కిరణ్ అనుకున్న విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























