కంగువ ప్రమోషన్స్‌.. భావోద్వేగానికి లోనైన సూర్య

Hero Suriya Gets Emotional During Kanguva Press Meet in Hyderabad

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లో జరిగిన కంగువ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా గతంలో తాను నటించిన ‘సూర్య S/o కృష్ణన్’ రీ-రిలీజ్ సందర్భంగా తెలుగు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడాన్ని గుర్తుచేసుకున్న సూర్య భావోద్వేగానికి గురయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. “నా సినిమా ఇక్కడ థియేటర్లలో విడుదలై 2 సంవత్సరాలు అయింది. కానీ సూర్య S/o కృష్ణన్ విడుదలైనప్పుడు మీరు చూపించిన ఆదరానికి చాలా ఆశ్చర్యం కలిగింది. నాపై మీకున్న ప్రేమను చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి, మీ అందరికీ చాలా థాంక్స్” అని సూర్య ఉద్వేగభరితంగా చెప్పారు. ఈ సమయంలో సూర్య కన్నీళ్లు ఆపుకోలేక, గొంతులోంచి మాటలు రాక మైకులో ప్రసంగించలేకపోయారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “దీనికి ప్రతిఫలంగా అభిమానులకు నేను ఇవ్వగలిగేది ఒక్కటే. వారికి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియె అందించడం, అది నా బాధ్యత. అందుకే మీరెప్పుడూ చూడని సినిమా ఇవ్వడానికి, కంగువ కోసం రెండున్నరేళ్లు తీసుకున్నాం. మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో, నేను ఎదగాలని కోరుకుంటున్నారో, అలాగే మీరు కూడా మీ జీవితంలో గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. అప్పుడు నేను మరింత సంతోషంగా ఉంటాను. ఐ లవ్ యూ ఆల్’’ అంటూ ముగించారు సూర్య.

అలాగే ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సూర్య సమాధానం నవ్వులు పూయించింది. కంగువ 1,000 కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ప్రశ్నకు సూర్య ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. “కంగువ అత్యధిక వసూళ్లు సాధించాలని టీమ్ అంతా కోరుకుంటున్నాం, ఆశపడితే తప్పేంటి? పెద్ద కలలు కనడం క్రైం కాదు కదా అని నవ్వుతూ బదులిచ్చారు సూర్య. దీనికి ఆ జర్నలిస్ట్.. అయితే, 2,000 కోట్లు సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? అని తిరిగి ప్రశ్నించాడు. ఇందుకు సూర్య స్పందిస్తూ, తప్పకుండా అలా జరగాలని కోరుకుంటున్నా అని మరోసారి నవ్వుతూ చెప్పారు.

కాగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువలో దిశా పటాని హీరోయిన్‌గా, బాబీడియోల్ విలన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తోంది. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్‌ సహా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.