బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఈ మేరకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి తాజాగా ఆయనకు ఒక కారును బహుమతిగా అందించారు. ఇంతకూ ఈ బహుమతికి కారణం ఏంటంటే..? గతేడాది నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత సాహు గారపాటి డైరెక్టర్ అనిల్ రావిపూడికి కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సందర్భంగా కారును దర్శకుడికి అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో, శ్రీలీల కీలక పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, కాజల్ ముఖ్యపాత్రల్లో కనిపించిన భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అయింది.
ఇక ఇదిలావుంటే, అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా తర్వలో విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























