నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా ఏఎన్నార్ పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండేవుంటుంది. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబం నాగేశ్వరరావు పేరుపై ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఏఎన్ఆర్ అవార్డును ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందించనున్నారు. అక్టోబర్ 28న జరుగనున్న ఏఎన్నార్ అవార్డుల ఫంక్షన్‌లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా చిరంజీవికి ఈ అవార్డ్ ప్రదానం చేయనుండటం విశేషం.
ఈ నేపథ్యంలో తాజాగా ఏఎన్నార్ తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. ఈ అవార్డుల వేడుకకు రావాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని చిరుకి అందజేశారు. నాగ్ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన చిరంజీవి, ఏఎన్నార్ అవార్డుకు ఎంపిక చేయడం తనకు లభించిన గొప్ప గౌరవం అని తెలిపారు.
ఈమేరకు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా చిరుని కలిసిన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా తెలిపారు.. “మా నాన్నగారు ఏఎన్నార్ 100వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం! సీనియర్ బచ్చన్‌ను ఆహ్వానించడం గౌరవంగా ఉంది. ఈ మైలురాయికి గుర్తుగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏఎన్నార్ అవార్డ్ అందించనున్నాం” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: