ఈ సినిమా చూసి ఆడియన్స్ కూడా గర్వపడతారు

Pottel Actress Ananya Nagalla Thanks Director Sandeep Reddy Vanga

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పొట్టేల్ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్‌గా హాజరవగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. “సందీప్ సార్ థాంక్యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ థిస్ ఈవెంట్. ఒక్కసారి కాదు టూ టైమ్స్ వచ్చారు మా సినిమా కోసం. ఫరెవర్ గ్రేట్ ఫుల్ టు యు. ఒక చిన్న సినిమానే పెద్ద సినిమాగా తీసుకెళ్లడంలో సందీప్ గారి సపోర్ట్ మాటల్లో చెప్పలేను. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్యూ సో మచ్. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సపోర్టు మీ నుంచి వస్తుంది. ప్రొడ్యూసర్స్ సురేష్, నిశాంక్ గారి పాషన్ వల్లే ఈ సినిమా ఇక్కడ నిలబడింది” అని అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “శేఖర్ చంద్ర గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఫీల్ తీసుకొచ్చింది. అందరి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇది. సినిమా చూసిన తర్వాత మేమంతా ఒక గొప్ప సినిమాలో పార్ట్ టైం అనిపించింది. ఈ సినిమా నేను చేసినందుకు మా మమ్మీ గర్వపడతారు. అక్టోబర్ 25న ఫిలిం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీతో పాటు ట్రావెల్ చేస్తుంది. ఒక మంచి సినిమా చూశామని ఆడియన్స్ కూడా గర్వపడతారు. మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.