‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నిధి అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ సినిమాలలో కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పునఃప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కీలక సన్నివేశాల్లో నటిస్తోంది నిధి అగర్వాల్. ఇక మరోవైపు క్రేజీ డైరెక్టర్ మారుతి నేతృత్వంలో రాజాసాబ్ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఈ క్రమంలో అనూహ్యంగా ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొనాల్సి రావడంతో నటి నిధి అగర్వాల్ అందుకు సంసిద్దమైంది. ఈ రెండూ అగ్ర హీరోల చిత్రాలు కావడం, షెడ్యూల్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసి ఉండటంతో నిధి అగర్వాల్ సవాల్‌గా తీసుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో, రెండు భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణలో ఒకేరోజు పాల్గొంటోంది.
ఈ మేరకు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది నిధి అగర్వాల్. అందులో.. “కళాకారుల జీవితం సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుంది. కానీ కొందరు మమ్మల్ని నిజంగా ఆశీర్వదించినట్టు కృతజ్ఞతతో అనుభూతి చెందేలా చేస్తారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2 పాన్-ఇండియన్ చిత్రాలను ఒకే రోజున షూట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను, అది కూడా ఒకటి ఆంధ్రాలో మరొకటి తెలంగాణలో.. ఒకరోజు 2 సినిమా షూట్‌లు 2 రాష్ట్రాలు.. మేం ఏం చేశామో అని మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది వేడుకగా ఉండబోతోంది!” అని పేర్కొంది హీరోయిన్ నిధి అగర్వాల్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: