కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో నిఖిల్, హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. అలాగే గూజ్ బమ్స్ తెప్పించే చేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఆకట్టుకంటున్నాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా సినిమాను నవంబర్ 8న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ జర్నీ ప్రారంభించింది. దీనిలో భాగంగా నేడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది. ‘హే తార’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం అందించగా.. కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. మొత్తానికి సాంగ్ అయితే మంచి మెలోడియస్‌గా ఉంది. యూత్‌ను బాగా ఆకట్టుకునేలా ఉంది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, చక్కటి కామెడీ, రొమాన్స్ సహా అన్నీ అంశాలతో సినిమా రూపొందింది. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. ఈసారి నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పక్కా అని తెలుస్తుంది.
కన్నడ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులర్ హీరోయిన్‌గా అందరినీ అలరిస్తోన్న రుక్మిణి వసంత్ .. ఈ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోంది. యంగ్ కమెడియన్ హర్ష చెముడు ఇంకో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్. బాపినీడు.బి ఈ చిత్రానికి సమర్పణ. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























