70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రం కార్తికేయ 2 సత్తా చాటింది. ఉత్తమ ఫీచర్ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు చందూ మొండేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు ఈ వేడుకలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రదానం చేస్తున్న అవార్డులు 2022 సంవత్సరానికి సంబంధించిన సినిమాలకు ప్రకటించినవి కావడం గమనార్హం.
ఇక కన్నడ సినిమా ‘కాంతార’కు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి అవార్డు అందుకోగా.. తమిళ సినిమా ‘తిరు చిత్రాంబళం’కు గాను ఉత్తమ నటిగా నిత్యా మీనన్ అవార్డు గెలుచుకున్నారు. ఇక లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ ఏకంగా ఐదు అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. అలాగే మలయాళ సినిమా ‘ఆట్టమ్’ ఉత్తమ సినిమాతో పాటు మరో రెండు అవార్డులు అందుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: