ఫైనల్ షెడ్యూల్ లో ఓదెల 2

odela 2 final schedule is currently underway in Odela village

తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఓదెల 2.మూడేళ్ళ క్రితం ఓటిటి లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇక ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఓదెల గ్రామంలోని ప్రఖ్యాత మల్లన్న గుడిలో తమన్నాతోపాటు ఇతర తారాగణం ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.నవంబర్ లో లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అశోక్ తేజ డైరెక్టర్ చేస్తుండగా ఇందులో తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది.హెబ్బా పటేల్,మురళి శర్మ ,యువ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈసినిమాకు పర్యవేక్షకుడిగా అలాగే ఓ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ ఫై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈసినిమాకు టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా సౌందర్‌రాజన్ డీవోపీగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.