మట్కా టీజర్ రిలీజ్

Mega Prince Varun Tej's Matka Teaser Released

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మట్కా నుంచి ఇప్పటికే విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మట్కా ఫైనల్ షెడ్యూల్‌లో ఉంది. రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతున్న ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మట్కా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు మేకర్స్ శనివారం విజయవాడ లోని ప్రముఖ రాజ్-యువరాజ్‌ థియేటర్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో వరుణ్ తేజ్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

ఇక మట్కా 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల కాలానికి సంబంధించిన కథగా రూపొందుతోంది. దీనిలో భాగంగా యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు తన పాత్రకు తగ్గట్టు వరుణ్ తేజ్‌ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. కాగా మట్కా కోసం మేకర్స్‌ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్‌ వైజాగ్‌ లొకేషన్స్‌ డిజైన్‌ చేయడం విశేషం.

ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్. ఆర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. కాగా మట్కా మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు రజనీ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.