ఎన్టీఆర్ దేవర మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 172కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని మేకర్స్ ప్రకటించారు. ఆలెక్కన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగానికి పైగా రికవరీ చేసింది.ఈరోజు,రేపు తో 80శాతం పూర్తి చేయనుండగా వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ కానుంది.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో దేవర 61కోట్ల షేర్ ను రాబట్టగా కర్ణాటక లో 10కోట్లు నార్త్ లో 7.90కోట్లు రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓవర్సీస్ లో అయితే దుమ్ము రేపుతోంది.నార్త్ అమెరికా సహా ఆస్ట్రేలియాలో హావ కొనసాగిస్తోంది. నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ తో కలిపి తొలిరోజు 3.7 మిలియన్ డాలర్లను రాబట్టగా ఆస్ట్రేలియా లో 500k మార్క్ ను క్రాస్ చేసింది.మొదటి రోజు ఓవరాల్ గా ఓవర్సీస్ లో 5మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో 80శాతం రికవరీ చేసింది.రేపటితో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మొత్తానికి తొలి రోజు ఊహించని వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది దేవర.దసరా వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో దేవర కు అడ్డువుండదు.సో ఈజీ గా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ఫుల్ రన్ లో మంచి లాభాలు తీసుకురావడం ఖాయం.దేవర ను కొరటాల శివ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: