ఎన్టీఆర్ దేవర ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వగా ఫస్ట్ డే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ నార్త్ లోకూడా పరిచయం అయ్యాడు. దాంతో దేవర హిందీ బుకింగ్స్ బాగానే వున్నాయి.రీసెంట్ గా అక్కడ కూడా ఈసినిమాను ప్రమోట్ చేశారు.దేవర టీం సందీప్ రెడ్డి వంగ తో ఓ ఇంటర్వ్యూ అలాగే అలియా భట్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు ఫేమస్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో లో కుడా దేవర టీం సందడి చేసింది.ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్,సైఫ్ అలీ ఖాన్ ఈషో లో పాల్గొన్నారు. ఈరోజు ఈ ఎపిసోడ్ ప్రోమో ను రిలీజ్ చేశారు. ఈప్రోమో ఎంటర్టైనింగ్ గా వుంది.ఎన్టీఆర్ హిందీలో అదరగొట్టాడు.ఫుల్ ఎపిసోడ్ ఈ శనివారం రాత్రి 8గంటలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక దేవరపై భారీ అంచనాలు వున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ హైక్స్ తో ఎక్స్ట్రా షో లు పడనుండడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.టాక్ బాగుంటే ఫుల్ రన్ లో 500 కోట్ల వరకు చేరుకోవచ్చు.మరి దేవర ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: