టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ యువతకు సందేశమిస్తూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ‘డ్రగ్స్ కి నో చెప్పండి’ (Say No To Drugs) అనే అవేర్‌నెస్ వీడియోను పంచుకున్న ఆయన డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ టీమ్ సహకారంతో తనవంతు బాధ్యతగా సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదలచేశారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం ఇందుకు సంబంధించి సినిమా పరిశ్రమకు ఓ కీలక సూచన చేసిన విషయం గుర్తుండేవుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు తారక్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి మద్దతుగా ఈ వీడియో రిలీజ్ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























