యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.శర్వాకి ఇది 37వ సినిమా.ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది.10రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.అందులో భాగంగా శర్వా,సాక్షి వైద్యలపై బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు.దీంతో పాటు పృథ్వీ మాస్టర్ నేతృత్వంలో ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.అలాగే ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో సాక్షి వైద్య ఓ హీరోయిన్ గా నటిస్తుండగా సంయుక్త మీనన్ మరో హీరోయిన్ గా చేస్తుంది.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయనున్నారు.
ఇక శర్వానంద్ ఈసినిమాతోపాటు ప్రస్తుతం తన 36వ సినిమాలో కూడా నటిస్తున్నాడు.అభిషేక్ కంకర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.కుదిరితే ఈఏడాది చివర్లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇవేకాకుండా శర్వా త్వరలోనే 38వ సినిమాను కూడా మొదలు పెట్టనున్నాడు.సంపత్ నంది డైరెక్ట్ చేయనుండగా భారీ బడ్జెట్ తో కేకే రాధామోహన్ నిర్మించనున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.మరి ఈమూడు సినిమాలు శర్వానంద్ కుఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























