తెలంగాణలో దేవర స్పెషల్ షోలు ప్రదర్శించనున్న థియేటర్లు ఇవే..!

Devara Special Shows in Telangana, Here is The Total Theatres List

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దేవ‌రకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపుద‌ల‌కు మరియు ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిని ఇస్తూ జీవో జారీ చేసింది. దీనిప్రకారం, సెప్టెంబరు 27న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. అయితే ఏయే థియేటర్లలో దేవర స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారో మీకు తెలియజేయడం కోసం ఇక్కడ పూర్తి లిస్ట్ ఇస్తున్నాం..

తెలంగాణలో దేవర స్పెషల్ షోలు ప్రదర్శించే థియేటర్లు ఇవే..!

హైదరాబాద్‍ నగరంలో..

  • ఆర్టీసీ క్రాస్‍రోడ్స్‌ – దేవీ 70ఎంఎం
  • ఆర్టీసీ క్రాస్‍రోడ్స్‌ – సంధ్య 70ఎంఎం
  • ఆర్టీసీ క్రాస్‍రోడ్స్‌ – సంధ్య 35ఎంఎం
  • ఆర్టీసీ క్రాస్‍రోడ్స్‌ – సుదర్శన్ 35ఎంఎం
  • ఎన్టీఆర్ గార్డెన్స్ – ప్రసాద్ మల్టీప్లెక్స్
  • అమీర్‌పేట్ – ఏఏఏ సినిమాస్
  • ఎర్రగడ్డ – గోకుల్ థియేటర్
  • మూసాపేట – శ్రీరాములు
  • కూకట్‍పల్లి – విశ్వనాథ్
  • కూకట్‍పల్లి – మల్లికార్జున
  • కూకట్‍పల్లి – భ్రమరాంబ
  • కూకట్‍పల్లి – అర్జున్
  • కూకట్‍పల్లి – పీవీఆర్ నెక్సస్ మాల్
  • ఆర్సీ పురం – ఎస్‍వీసీ సంగీత
  • మల్కాజ్‍గిరి – శ్రీసాయిరాం
  • దిల్‍సుఖ్‍నగర్‌ – కోణార్క్
  • కర్మాన్‍ఘాట్‍ – ఎస్‍వీసీ శ్రీలక్ష్మి
  • అత్తాపూర్‌ – ఎస్‍వీసీ ఈశ్వర్
  • మాదాపూర్ – బీఆర్ హైటెక్
  • గచ్చిబౌలి – ఏఎంబీ సినిమాస్
  • నల్లగండ్ల, శేరిలింగంపల్లి – అపర్ణ సినిమాస్

ఇతర జిల్లాల్లోని థియేటర్లు..

  • ఖమ్మం – శ్రీతిరుమల
  • ఖమ్మం – వినోద
  • ఖమ్మం – సాయిరామ్
  • ఖమ్మం – శ్రీనివాస
  • ఖమ్మం – కేపీఎస్ ఆదిత్య
  • మిర్యాలగూడ – విట్రోస్ సినీప్లెక్స్
  • మహబూబ్‍నగర్‌ – ఏవీడీ తిరుమల కాంప్లెక్స్
  • గద్వాల్‍ – ఎస్‍వీసీ మల్టీప్లెక్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.