రొటీన్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టి డిఫ్రెంట్ స్టోరీస్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు.అందులో భాగంగా రీసెంట్ గా హరోం హర తో వచ్చి హిట్ కొట్టాడు ఈహీరో.ఇక ఇప్పుడు ‘జటాధర’ అనే సినిమా చేయనున్నాడు.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.ఇందులో సుధీర్ సూపర్ నాచురల్ పవర్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడు.ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ప్రేరణ అరోరా,శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుంది అలాగే ప్రతినాయకి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటించనుంది.ఆ వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలోనే సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా సినిమా గా విడుదలకానుంది.వచ్చే ఏడాది శివరాత్రికి థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక హరోం హర తరువాత సుధీర్ బాబు ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ అక్టోబర్ 11న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























