పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే గత కొన్ని నెలలుగా పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.త్వరలోనే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది.నిజానికి పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెపుదాం అనుకున్నారు కానీ కుదరలేదు.ఇక తొందర్లోనే ఫస్ట్ సాంగ్ రానుంది.ప్రముఖ తమిళ హీరో శింబు ఈ సాంగ్ ను పాడుతున్నాడు.నిన్న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి.అన్ని కుదిరితే దసరాకు ఈసాంగ్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని అంచనాలను పెంచేసింది.ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ,శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.
ఇక పవన్ ఈసినిమా తోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో హరిహర వీరమల్లు ఒకటి కాగా మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్.ఈరోజు నుండి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.వచ్చే ఏడాది మార్చి 28న విడుదలకానుంది.ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఈఏడాది చివర్లో స్టార్ట్ కానుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇది కూడా వచ్చే ఏడాది రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: