గత నెలలో మంచి అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన నాని సరిపోదా శనివారం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నానికి హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ ను అందించింది.అంతేకాదు అటు నార్త్ అమెరికాలో 2.4మిలియన్ డాలర్ వసూళ్ల తో నాని కెరీర్ బెస్ట్ గా నిలిచింది.ఇప్పటికీ ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి రానుంది.సౌత్ తోపాటు హిందీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.దాంతో ఈనెల 26నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకుండానే సరిపోదా శనివారం ఓటిటిలోకి రానున్నడం గమనార్హం.మరి థియేటర్లలో సూపర్ అనిపించుకున్న ఈసినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.యాక్షన్ ఎంటర్టైనర్ గా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు.జేక్స్ బెజాయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ఈసినిమాను నిర్మించారు.
ఇక నాని ప్రస్తుతం తన 32వ సినిమా హిట్ 3లో నటిస్తున్నాడు రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో నాని రూత్ లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించనున్నాడు.శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.ఈసినిమా తరువాత నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తో సినిమా చేయనున్నాడు.త్వరలోనే ఈసినిమా సంబంధించిన అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























