రజినీకాంత్ మ‌నంద‌రికీ ఓ మంచి గిఫ్ట్ – అమితాబ్ బ‌చ్చ‌న్

Amitabh Bachchan Praises Super Star Rajinikanth in Vettaiyan Prevue, Audio Launch Event

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై భీమ్‌’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ రజినీకాంత్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వేట్టైయాన్ ఆడియో వేడుక‌ చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఎడిట‌ర్ కె.క‌దిర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఫిలోమ‌న్‌, అభిరామి, రితికా సింగ్‌, దుసారా విజ‌య‌న్, భరత్ నారంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమితాబ్ బ‌చ్చ‌న్ మాట్లాడుతూ.. “ర‌జినీకాంత్‌తో చాలా సంవ‌త్స‌రాలుగా మంచి ప‌రిచ‌యం ఉంది. వృత్తి ప‌రంగానే కాదు, వ్య‌క్తిగ‌తంగానూ త‌ను నాకెంతో స‌న్నిహితంగా ఉంటారు. ర‌జినీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన త‌ర్వాత నేను జ్ఞాన‌వేల్ నెరేష‌న్ న‌చ్చి సినిమా చేయ‌టానికి ఒప్పుకున్నాను. ర‌జినీకాంత్‌తో యాక్ట్ చేయ‌టానికి గొప్ప‌గా, గ‌ర్వంగా భావిస్తున్నాను. త‌ను మ‌నంద‌రికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యుమ‌న్ బీయింగ్‌. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. వేట్టైయాన్ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.