కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్- ది హంటర్’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ రజినీకాంత్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వేట్టైయాన్ ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిటర్ కె.కదిర్, ప్రొడక్షన్ డిజైనర్ ఫిలోమన్, అభిరామి, రితికా సింగ్, దుసారా విజయన్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మాట్లాడుతూ.. “వేట్టైయాన్ సినిమా చేసిన రజినీగారికి, లైకా ప్రొడక్షన్స్‌కి ముందుగా ధన్యవాదాలు. జ్ఞానవేల్‌తో సినిమా అనగానే తను నాకు సెట్ అవుతాడా? అని ఆలోచించాను. కానీ తనను కలిసిన తర్వాత నాకు కొత్తగా అనిపించింది. రజినీకాంత్‌గారిని ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కొత్తగా చూస్తారు. నేను రజినీగారికి పెద్ద అభిమానిననే విషయం అందరికీ తెలిసిందే. ప్రతీసారి ఆయనతో వర్క్ చేసేటప్పుడు గూజ్‌బమ్స్ వస్తాయి. నాకు సపోర్ట్ చేసిన టీమ్‌కు, మేకర్స్‌కు ధన్యవాదాలు” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























