కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్- ది హంటర్’. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ రజినీకాంత్ భార్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వేట్టైయాన్ ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిటర్ కె.కదిర్, ప్రొడక్షన్ డిజైనర్ ఫిలోమన్, అభిరామి, రితికా సింగ్, దుసారా విజయన్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ వేట్టైయాన్ విశేషాలు వివరించారు. రజిని ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. ‘‘లైకా ప్రొడక్షన్స్ సంస్థకి, మంజు వారియర్, రానా దగ్గుబాటి సహా ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్, అందరికీ ధన్యవాదాలు. సాధారణంగా సినిమా హిట్ తర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లో ఓ టెన్షన్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటారు. హిట్ తర్వాత హిట్ మూవీ ఇవ్వాలనే టెన్షన్ అందరికీ ఉంటుంది. అయితే మూవీ హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ అలా కుదరాలి.”
“జ్ఞానవేల్ చెప్పిన కథ విన్న తర్వాత నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. అయితే నేను లోకేష్, నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను.. నా స్టైల్లో నేను చేస్తానని అన్నారు. నాకు కూడా అదే కావాలని నేను అనటంతో ఆయన కథను తయారు చేశారు. తర్వాత సుభాస్కరన్‌ను కలిసి కథ చెప్పగా, ఆయనకు నచ్చింది. లైకా ప్రొడక్షన్స్ అంటే నా సొంత బ్యానర్‌లాంటిది. మెల్లగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ సినిమాలో యాడ్ అయ్యారు.”
“అమితాబ్ పాత్ర గురించి జ్ఞానవేల్ చెప్పి, ఆయనే చేయాలని చెప్పారు. డైరెక్టర్‌గారు సుభాస్కరన్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయన టీమ్‌లో భాగమయ్యారు. ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో నటింటానికి ఒప్పుకున్నారని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిపరంగానే కాదు, పర్సనల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు అమితాబ్‌గారు ఎంత పెద్ద నటుడో తెలియదు. నేను ఆయన్ని దగ్గర నుంచి చూశాను.” అని తెలిపారు.
“అలాగే ఫహాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ పాత్రను తనెలా చేస్తాడోనని అనుకున్నాను. తను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈతరంలో తనలాంటి నటుడ్ని నేను చూడలేదు. రామానాయుడుగారి మనవడిగా రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బయటకు నార్మల్‌గా మాట్లాడుతూ కనిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్టర్‌గా ఆయన మారిపోతారు. తను చాలా మంచి యాక్టర్. బాహుబలి సహా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నటుడు” అని అన్నారు హీరో రజినీకాంత్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: