రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా రానున్న సంగతి తెలిసిందే.ఇక నిన్న ఈసినిమా షూటింగ్ తమిళనాడు లోని కరైకుడి లో స్టార్ట్ అయ్యింది.ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ జరుగనుంది.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.ఆమెకు ఇదే మొదటి సినిమా.మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రల్లో కనిపించనుండగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ షూట్ లో బిజీ గా వున్నాడు.గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో నాన్ స్టాప్ షూటింగ్ జరుగుతుంది.ఈ షెడ్యూల్ తో సగానికి పైగా కంప్లీట్ కానుంది.ప్రభాస్ బర్త్ డే రోజు అక్టోబర్ 23న ఈసినిమా నుండి అప్డేట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది టీం.మారుతి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలకానుంది.
ఈసినిమాను పూర్తి చేసిన తరువాతే ప్రభాస్ ,హను తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.ఇక ఇవే కాకుండా ప్రభాస్ లైనప్ లో మరో మూడు సినిమాలు వున్నాయి.అందులో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 ,నాగ్ అశ్విన్ తో కల్కి 2 సినిమాలు చేయాల్సివుంది.వీటిలో ముందుగా స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: