దేవర మరో ఆరు రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.ట్రైలర్ ,సాంగ్స్ అన్ని సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.విడుదలకు ముందు అన్ని పాజిటివ్ గా ఉండగా ఇప్పుడు మరో అడ్వాంటేజ్ లభించింది.ఏపీలో ఈసినిమాకు రెండు వారాల పాటు టిక్కెట్ హైక్ తో పాటు ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి పర్మిషన్ లభించింది.దాంతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం.ఇక టిక్కెట్ ధరల పెంపుకు అలాగే ఎక్స్ట్రా షోస్ పర్మిషన్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.ఈసందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తెలంగాణ లో ఇంకా పర్మిషన్ రావాల్సివుంది.ఇక రేపు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.ఇందులో రిలీజ్ ట్రైలర్ ను విడుదలచేయనున్నారు.ఈసినిమా పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేశాయి.హిట్ టాక్ వస్తే అక్కడ దేవర హావ కొనసాగనుంది.
కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.అనిరుధ్ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో యువసుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: