100కోట్ల క్లబ్ లో సరిపోదా శనివారం

Saripodhaa Sanivaaram joins 100cr club

న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.సాలిడ్ రన్ తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చి 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.పెద్ద సినిమాల నుండి పోటీ లేకపోవడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.అటు 4ఈసినిమా నార్త్ అమెరికాలో 2.4 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టి నానికి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను ఇచ్చింది.ఓవరాల్ గా నానికి ఇది రెండో 100కోట్ల సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత ఏడాది దసరాతో మొదటి సారి ఈ ఫీట్ సాధించాడు.దసరా ఫుల్ రన్ లో 125కోట్ల వసూళ్లను రాబట్టింది.అయితే సరిపోదా శనివారం ఈరికార్డును బీట్ చేయడం కష్టమే.ఎందుకంటే వచ్చే వారంలో దేవర విడుదలకానుంది.దాంతో సరిపోదా శనివారంకు గట్టి పోటీ ఎదురుకానుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.ప్రముఖ తమిళ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో మెరిశాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.

ఇక సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ ను పూర్తి చేసిన నాని బ్రేక్ తీసుకోకుండా అప్పుడే మరో సినిమాను స్టార్ట్ చేశాడు.అందులో భాగంగా నాని ప్రస్తుతం హిట్3లో నటిస్తున్నాడు.కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా నాని కలిసి ప్రశాంత్ తిపిర్నేని నిర్మిస్తుంది.వీలైనంత తొందరగా హిట్ 3ని పూర్తి చేసి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేయనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడు నాని.సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.