ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరా కానుకగా అక్టోబర్ 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రచార చిత్రాలు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఇక ఇటీవలే జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
మరోవైపు జనక అయితే నుంచి ఫస్ట్ సింగిల్ ‘నా ఫేవరెట్ నా పెళ్ళాం’, సెకండ్ సింగిల్ ‘నువ్వే నాకు లోకం’ పాటలను రిలీజ్ చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఏం పాపం చేశామో’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో అద్భుతంగా ఉంది. ఈ పాటకు కృష్ణకాంత్ గీత రచయిత కాగా రితేష్ జి రావు రాప్ రాయడంతోపాటు ఆలపించాడు.
ఇక ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్ గాంధీ పనిచేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి గ్రాండ్‌గా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: