ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న కీర్తి సురేష్ సినిమా

Keerthy Suresh's Raghu Thatha Hits 50 Million Streaming Minutes in 24 Hours on OTT

‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓ అరుదైన ఫీట్ సాధించింది. ఓటీటీలో విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రం 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్ అందుకుంది. వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.